![]() |
![]() |

ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు సైతం రూ.200-300 కోట్ల గ్రాస్ రాబట్టడం కష్టమైపోయింది. ఇలాంటి సమయంలో కొత్తవాళ్లు నటించిన 'సైయారా' సినిమా.. ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించింది. (Saiyaara Collections)
'మర్డర్ 2', 'ఆషికీ 2', 'ఏక్ విలన్', 'మలంగ్' వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సైయారా'. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాతో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా జూలై 18న థియేటర్లలో అడుగుపెట్టిన 'సైయారా' మూవీ.. సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం 19 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.502 కోట్ల గ్రాస్ రాబట్టింది సమాచారం.
ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'ఛావా' నిలిచింది. ఇది దాదాపు రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.500 కోట్ల గ్రాస్ తో.. ఆ తర్వాతి స్థానంలో 'సైయారా' నిలిచింది. ఫుల్ రన్ లో రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వారం రోజులు 'సైయారా' బాక్సాఫీస్ రన్ కొనసాగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆగస్టు 14న 'వార్-2' (War 2) విడుదల కానుంది. ఇది కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లోనే రూపొందడం విశేషం. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు. బిగ్ స్టార్స్ కలిసి నటించిన మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా పాజిటివ్ టాక్ కూడా వస్తే.. 'వార్-2' మూవీ సులభంగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నట్లు అవుతుంది.
![]() |
![]() |